Samanulevaru prabho nee samanu levaru prabho సమానులెవరు ప్రభో నీ సమానులెవరు ప్రభో
Song no: #94
- సమానులెవరు ప్రభో నీ సమానులెవరు ప్రభో సమస్త మానవ శ్రమాను భవమున్ సహించి వహించి ప్రేమించగల నీ ||సమాను||
- సమాన తత్వము సహోదరత్వము సమంజసము గాను మాకు దెలుప నీ ||సమాను||
- పరార్ధమై భవ శరీర మొసగిన పరోపకారా నరావ తారా||సమాను||
- దయా హృదయ యీ దురాత్ము లెల్లరిన్ నయాన భయాన దయాన బ్రోవ నీ ||సమాను||
- ఓ పావనాత్ముడ ఓ పుణ్య శీలుడ పాపాత్ములను బ్రోవ పరమాత్మ సుతనీ ||సమాను||