Agni mandinchu nalo agni mandinchu అగ్ని మండించు నాలో అగ్ని మండించు

Song no: 80
    అగ్ని మండించు – అగ్ని మండించు
    పరిశుద్ధాత్ముడా – నాలో అగ్ని మండించు – |2|

  1. అగ్ని మండుచుండెనే – పొద కాలిపోలేదుగా
    ఆ అగ్ని లో నుండే – నీవు మోషేను దర్శించినావే } 2 || అగ్ని ||

  2. అగ్ని కాల్చి వేసెనే – సిద్ధం చేసిన అర్పణను
    ఆ అగ్ని ద్వారానే – నీవు గిద్యోన్ని దైర్యపరచితివే } 2 || అగ్ని ||

  3. అగ్ని కాన రానందునా – వారు సిగ్గు పడిపోయిరే
    నీ అగ్ని దిగిరాగా – నీవు ఏలియాను ఘన పరచినావే } 2 || అగ్ని ||

  4. ప్రాణ ఆత్మ శరీరము – నీకే అర్పించు చున్నానయ్యా
    నీ ఆత్మ వరములతో – నను అలంకరించుమయా } 2 || అగ్ని || 

Blogger ఆధారితం.