కానుక తెచ్చాను అర్పించగ దేవా [2] ప్రేమతో స్వీకరించు నాదైవమా [2] || కానుక తెచ్చాను || పువ్వులు తేవాలని తోటకు వెళ్ళాను విరివిగా ఉన్నాయి విరసిన కూసుమాలు [2] కమ్మని సువాసనల తెమ్మెద మధురిమలు [2] నీగుడిలో ఉండాలని అడిగి అడిగి వచ్చాయి [2] || కానుక తెచ్చాను || ఫలములు తెద్దామని తోటలు వేధికాను చెట్లమీద ఉన్న పండ్లు చేర్చు ప్రభుని అన్నాయి [2] మంచి మంచి ఫలములు మధురమైన ఫలములు [2] ఏరికోరి తెచ్చాను నీకె అర్పించాలని [2] || కానుక తెచ్చాను || శ్రమలతో పండించిన ఫలములే తప్పా నీరునము తీర్చగా ఏమివ్వగలను [2] నిర్మల మనస్సును నితిగల ప్రేమను [2] నీకొరకే అర్పించేద స్వీకరించు దేవా [2] || కానుక తెచ్చాను || || || Song info Writer ✍ : Koka Joseph Ranjith Album 📀 : Singers 🎤 : Koka Joseph Ranjith,Showrilu Book 📖 : Text sizes Small size:ex:-Mobile Medium sizes ex:- System,Tv's Large sizes ex:-Wall screen,Projector