Anadhamuga yehova lyrics


ఆనందముగా యెహోవా నీ కృపలన్ని
అన్ని కాలంబులందు కీర్తించెదన్ (2)
1) చావు గోతినుండి లెవనెత్తి నాకు – జీవమిచ్చిన జీవ దాత
వివరింతు నే నీదు విశ్వాస్యత నెంతయో
సవ్యంబుగా ఈ భువియందున          
||ఆనందముగా||
2) సింహపు పిల్లలు – ఆకలిగొనిన- యెహొవ సహాయుడందరికి
ఇహమందునా ఏ మేలు కొదువ యుండదు
అహా! ఏమందు నీ విశ్వాస్యతన్        
||ఆనందముగా||
3) ఎన్నెన్నో శోధన బాధలు రేగి – నన్ను కృంగదీయ పోరాడినన్
ఘనమైన నీ విశ్వాస్యతన్ నాకు చూపిన
కన్న తండ్రి నిన్ను కొనియాడెదన్      
||ఆనందముగా||
4) పర్వతంబులు – పారిపోయినను- ఉర్విలోమార్పు కలిగిననూ
తరుణములు విరోధముగపై లేచినా –
స్మరియించెద నీ విశ్వాస్యతన్            
||ఆనందముగా||

కామెంట్‌లు లేవు

Blogger ఆధారితం.