Song no : 002
    ఆనందయాత్ర ఇది ఆత్మీయ యాత్ర
    యేసుతో నూతన యెరుషలేము యాత్ర
    మన యేసుతో నూతన యెరుషలేము యాత్ర
  1. యేసుని రక్తము పాపములనుండి విడిపించెను -2
    వేయినోళ్ళతో స్తుతించినను - తీర్చలేము ఆ ఋణమును -2 ॥ ఆనంద ॥

  2. రాత్రియు పగలును పాదములకు రాయి తగులకుండా -2
    మనకు పరిచర్య చేయుట కొరకై - దేవదూతలు మనకుండగా -2 ॥ ఆనంద ॥

  3. ఆనందం ఆనందం యేసునిచూచే క్షణం ఆసన్నం -2
    ఆత్మానందా భరితులమై - ఆగమన కాంక్షతో సాగెదం -2 ॥ ఆనంద ॥