Song no:
    దుర్దినములు రాకముందే – సర్వం కోల్పోకముందే
    అంధత్వం కమ్మకముందే – ఉగ్రత దిగిరాకముందే } 2
    స్మరియించు రక్షకుని అనుకూల సమయమున
    చేర్చుకో యేసుని ఆలస్యం చేయక } 2 || దుర్దినములు ||

  1. సాగిపోయిన నీడవంటి జీవితం
    అల్పమైనది నీటి బుడగ వంటిది (2)
    తెరచి ఉంది తీర్పు ద్వారం
    మార్పులేని వారికోసం (2)
    పాతాళ వేదనలు తప్పించుకొనలేవు
    ఆ ఘోర బాధలు వర్ణింపజాలవు } 2 || దుర్దినములు ||

  2. రత్నరాసులేవి నీతో కూడ రావు
    మృతమైన నీ దేహం పనికిరాదు దేనికి } 2
    యేసు క్రీస్తు ప్రభువు నందే
    ఉంది నీకు రక్షణ } 2
    తొలగించు భ్రమలన్ని కనుగొనుము సత్యాన్ని
    విశ్వసించు యేసుని విడిచిపెట్టు పాపాన్ని } 2 || దుర్దినములు ||

Song no:
    Durdinamulu Raakamunde – Sarvam Kolpokamunde
    Andhathvam Kammakamunde – Ugratha Digiraakamunde (2)
    Smariyinchu Rakshakuni Anukoola Samayamuna
    Cherchuko Yesuni Aalasyam Cheyaka } 2 || Durdinamulu ||

  1. Saagipoyina Needavanti Jeevitham
    Alpamainadi Neeti Budaga Vantidi (2)
    Therachi Undi Theerpu Dwaaram
    Maarpuleni Vaarikosam (2)
    Paathaala Vedanalu Thappinchukonalevu
    Aa Ghora Baadhalu Varnimpajaalavu } 2 || Durdinamulu ||

  2. Rathnaraasulevi Neetho Kooda Raavu
    Mruthamaina Nee Deham Panikiraadu Deniki (2)
    Yesu Kreesthu Prabhuvu Nande
    Undi Neeku Rakshana (2)
    Tholaginchu Bhramalanni Kanugonumu Sathyaanni
    Vishwasinchu Yesuni Vidichipettu Paapaanni } 2 || Durdinamulu ||