Song no:

సాగేటి జీవ యాత్రలో రేగేటి పెను తుఫానులెన్నో
ఆదరించవా నీ జీవ వాక్కుతో సేద దీర్చవా నీ చేతి స్పర్శతో
1. సుడిగుండాలెన్నో లోకసాగరానా వడిగా నను లాగి
పడద్రోసే సమయాన నడిపించగలిగిన నా చుక్కాని నీవే
విడిపించగలిగిన నాకున్న దిక్కు నీవే
యేసయ్యా మెస్సయ్యా హలెలూయా నీకే స్తోత్రమయా

2. వడగాల్పులెన్నో నా పయనం లోన నడవనీక సొమ్మసిల్ల
జేసే సమయాన తడబాటును సరిచేసే ప్రేమ మూర్తి నీవే
కడవరకు నడిపే ఇమ్మానుయేలు నీవే
యేసయ్యా మెస్సయ్యా హలెలూయా నీకే స్తోత్రమయా