భయములేదుగా, దిగులు లేదుగా, యేసుని నమ్మిన వారికి(2)
విడువడునిన్ను, ఎడబాయడు నిన్ను(2)
మాటఇచ్చిన దేవుడు నిన్ను మర్చిపోవునా(3)

1.ఆహారము లేదని చింత ఏలనో, వస్త్రములులేవని దిగులు ఏలనో
ఆకాశపక్షులను చూడుడి చూడుడి, విత్తవు కోయవు పంటను కూర్చు కొనవు
ఆయనేవాటిని పోషించుచున్నాడు"భయము"

2.తల్లి అయినా మరచినా మరువ వచ్చును, తండ్రిఅయినా విడచినా విడువ వచ్చును
వారైనామరచినా మరువవచ్చునేమో, నేనెన్నడూ నిన్ను మరువకుందును"భయము"

3.ఆరోగ్యం లేదని కృంగుటేలనో, ఆర్థికంగాలేనని జడియనేలనో అడుగువాటికంటే
ఉహించువాటికంటేఅత్యధికముగ ఇచ్చు ఏసుడుండగా చింత దిగులు మాని యేసు ప్రభునుస్తుతించు"భయము"