Song no:

వస్తున్నాడు వస్తున్నాడు నీతి సూర్యుడు
వస్తున్నాడు వస్తున్నాడు జయశీలుడు  "2"
పరలోకము విడచి వస్తున్నాడు
ఆకాశ మేఘాల మీద వస్తున్నాడు.       "2"
నిను కొని పోవుటకు వస్తున్నాడు.        "2"
సిద్ధపడుము నీవు యేసయ్య రాకడకై     "2"
                                           "వస్తున్నాడు"

జనముల మీదకి జనములను
రాజ్యము మీదకి రాజ్యములు లేచును.  " 2 "
అక్కడక్కడ కరువులు భూకంపము
కలుగును.                                           " 2 "
వేదనకు ప్రారంభమైన రెండవ రాకడ.   "2"*
అంతము వరకు సహించిన
వాడెవడో వాడే రక్షింపబడును.             "2"*
                                            "వస్తున్నాడు"

జల సాగరములు పొంగి పారును
అక్కడక్కడ సునామి వచ్చి
ముంచివేయును                      " 2 "
తుఫాను గాలులు విసెరెను
వన వృక్షములు విరిగిపోవును. "2"
వేదనకు ప్రారంభమైన రెండవ రాకడ. "2"*
అంతము వరకు సహించిన
వాడెవడో వాడే రక్షింపబడును.          "2"*
                                            "వస్తున్నాడు"

చీకటి సూర్యుని కమ్మును
చంద్రుడు తన కాంతినియ్యడు.    "2"
ఆకాశ శక్తులు కదులును
నక్షత్రములు రాలును  " 2 "
వేదనకు ప్రారంభమైన రెండవ రాకడ.   "2"*
అంతము వరకు సహించిన
వాడెవడో వాడే రక్షింపబడును.             "2"*
                                            "వస్తున్నాడు"