తలవంచకు నేస్తమా తలవంచకు నేస్తమా
తలవంచకు ఎప్పుడూ తలవంచకు ఎప్పుడూ
తలవంచకు ఎన్నడూ
స్వార్ధపుటంచున ఊగిసలాడే లోకంలో
కుడియెడమలకు భేదం తెలియని లోకంలో
కన్నులు నెత్తికి వచ్చిన ఈలోకం లో
ప్రేమకు అర్థం గ్రహించలేని లోకంలో
నీవుకావాలి ఓ మాదిరి నీవు ఇవ్వాలి ఓ ప్రేరణ
నీవు మండలి ఓ జ్వాలాగా నీవు చేరాలి ఓ గమ్యము
1.చీకటిని వెనుకకు త్రోసి సాగిపో ముందుకే
క్రీస్తు బాటలో పాయనిస్తే ఎదురెమున్నది
రేపటి భయం నిందల భారం ఇకపై లేదులే
క్రీస్తు ని చేరు లోకాన్ని వీడు విజయం నీదేలే  "2" 
2.పెకిలించు కొండలను విశ్వాస బాటలో
గెలవాలి యుద్ధరంగంలో దైవిక బలంతో
యేసు ని కృప నీతోనె ఉంది సాధించు ప్రగతిని
మంచిని పెంచు ప్రేమను పంచు నిలచిపో జగతిలో  "2"