ఆకాశం వెలిగింది రాత్రి వేళలో
భూలోకం నిండింది శాంతి సంతోషం
పరలోకం విరిసింది గాన ప్రతిగానం (2)
సర్వోన్నతమైన స్థలములలో
ఘన దేవునికే మహిమా
ఆయన కిష్టులైన మనుజులకు
భూమ్మీద సమాధానము
కలుగునుగాక కలుగునుగాక హల్లెలూయాని (2)
పరలోక నాధుండు - లోకాన్ని ప్రేమించి
పరసుతుడై పుట్టాడు - మరియమ్మ గర్భామందున
ధరపాపి రక్షింపన్ నరరూప దాల్చాడు(2)(ఆకాశం)
పొలమందు కాపరులు రాత్రివేళయందు
చలియందు తమ మందను కాపుకాయుచు నుండగ
ఎరిగించె శుభవార్త దూత గొల్లలకు (2)(ఆకాశం)
చూచారు ఘగనానా - ఒక తార జ్ఞానులు
చేరారు ఆ తార వెంట
బెత్లెహేము గ్రామమున్ (2)
గాచారు ప్రభురాజున్ మ్రొక్కికాంతులతో (2) (ఆకాశం)